Friday, April 26, 2024
- Advertisement -

చిరంజీవి అల్లుడు కోసం బాల‌య్య వ‌స్తున్నాడా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచియ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.విజేత సినిమాతో క‌ల్యాణ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను వారాహి వారు విజేత సినిమాను నిర్మించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళ‌విక న‌టిస్తుంది.ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఇక సినిమా ఆడియో ఫంక్షన్‌ను ఈ నెల(జూన్)లో చివ‌రి వారంలో నిర్వ‌హించాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది.

అయితే ఆడియో ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిగా హీరో బాల‌కృష్ణ వ‌స్తున్నార‌ని స‌మాచారం.బాల‌య్య చేతుల మీద‌గా ఆడియో విడుద‌ల చేస్తే మంచి హిట్ అవుతుంద‌ని చిరంజీవి భావిస్తున్నారట‌!.దీనిపై బాల‌కృష్ణ‌ను సంప్ర‌దిస్తే ,ఆయ‌న త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని మాట ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో మెగా ఫ్యామిలీ హీరో ఆడియో ఫంక్ష‌న్‌కు బాల‌య్య రావ‌డంతో ఈ ఆడియో ఫంక్ష‌న్‌పై ఆస‌క్తి పెరిగింది.ఇక ఈ ఆడియో ఫంక్ష‌న్‌కు మెగా హీరోలంద‌రు వ‌స్తార‌ని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -