Wednesday, May 15, 2024
- Advertisement -

అభిమాని చెంప ఛెల్లుమనిపించిన బాలకృష్ణ.. ఎందుకో తెలుసా?

- Advertisement -

టాలీవుల్ లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నందమూని బాలకృష్ణ. ఓవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న బాలయ్య హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.  ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మూవీలో నటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే ప్రస్తుతం ఏపిలో జరగబోయే పుర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.  

నందమూరి బాలకృష్ణకు కోపం వచ్చిందంటే ఆగరు.. పబ్లిక్‌లో ఉన్నా.. ప్రైవేట్ గా ఉన్నా  కోపం వచ్చిందంటే.. అవతలి వ్యక్తికి ఒకటి తగిలించాల్సిందే.. అదే సమయంలో.. సహాయం చేయడంలో ఆయన ముందు వరసలో ఉంటారు.. ఇప్పటికే పలు సార్లు అతి చేసిన తన అభిమానులపై చేయి చేసుకున్న బాలయ్య.  

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న బాలయ్యను ఓ వ్యక్తి ఫోటో తీశాడు. అంతే బాలయ్య కు కోపం వచ్చింది. వెంటనే చేయి చేసుకున్నాడు. ఫోటో డిలీట్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ ఇది షరామామూలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బాలయ్య కొద్దిగా కోపం తగ్గించుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -