Sunday, May 19, 2024
- Advertisement -

బాలయ్య డిక్టేటర్ ఆడియో అమరావతి లో..

- Advertisement -

బాలయ్య బాబు ప్రతిష్టాత్మక 99 వ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా సాగుతోంది. ఈ సినిమా విషయంలో బాలయ్య బాబు యాక్షన్ తో పాటు చాలా శాతం కామెడీ కూడా పంచె పనిలో పడ్డారు అని తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీ లో ఇవాళ నుంచీ కొత్త షెడ్యూల్ మొదలు అయ్యింది. 

70 % ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు ఇవాళ నుంచీ భారీగా తెరకి ఎక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి. ఈ సినిమా ఆడియో ని అమరావతి లో ప్లాన్ చేస్తున్నారు అని చెబుతున్నారు. అమరావతి లో జరగబోతున్న మొట్ట మొదటి ఆడియో లాంచ్ గా ఈ కార్యక్రమం సాగుతుంది . బాలయ్య బాబు అక్కడి జనాల మధ్యనే ఆడియో వేడుక చెయ్యాలి అని స్వయంగా పూనుకున్నారు అని చేబుతునారు.

 జనవరి 14 న సినిమా విడుదల కి సన్నాహాలు సాగుతూ ఉండగా వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చెయ్యలేన్ కంగారు లో ఉన్నారు. లౌఖ్యం సినిమా ఫేం దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమా కి దర్సకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా బాలయ్య – తమన్ ల కాంబినేషన్ లో తొలి సారిగా మాస్ బీట్ లు పడబోతూ ఉండడం తో అడిరిపోయేలాగా పాటలు ఉండబోతున్నాయి అంటున్నారు. డిసెంబర్ ఇరవై న అంగరంగ వైభవంగా సినిమా ఆడియో వుంటుంది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -