Tuesday, May 21, 2024
- Advertisement -

బాలయ్య “లయన్” ఎంత పెద్ద డిజాస్టర్ అంటే..!

- Advertisement -

“లయన్” అనే టైటిల్ కానీ.. నందమూరి నటసింహం బాలయ్యకు ఉన్న ఇమేజ్ కానీ ఆ సినిమాను రక్షించలేకపోయింది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుల అయిన ఈ సినిమా వారిని ఆకట్టుకోలేకపోతోంది.

ఒకవైపు ‘లెజెండ్’ వంటి సినిమాలు వందల రోజులను పూర్తిచేసుకొంటూ పోతున్న ఉత్సాహంలో విడుదల అయిన “లయన్” బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలే ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

గతవారంలో ఈ సినిమాను విడుదల చేసిన థియేటర్లు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎంతగానంటే.. చాలా ఖాళీగా. గత వారంలో ఓపెనింగ్స్ ను క్యాష్ చేసుకొని.. జనాల వీకెండ్ ఉత్సాహాన్ని కూడా కొంత వరకూ క్యాష్ చేసుకొన్న ఈ సినిమా సోమవారం నుంచి నడవడం చాలా కష్టం అయ్యింది. 

ఆది వారం వరకూ కూడా అంతో ఇంతో కలెక్షన్లు లభించాయి కానీ.. సోమవారం నుంచి మరీడల్ అయిపోయింది సినిమా. సోమ, మంగళవారాల్లో చాలా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. కనీసం పదో వంతు సీట్లు కూడా నిండుతున్న పరిస్థితులు లేవు. బయట అంతగా ఆకట్టుకొనే సినిమాలు ఏవీ లేకపోయినా.. ‘లయన్’ పరిస్థితి మాత్రం ఏం బాగోలేదు. ఇలా పోటీలో మరే సినిమానూ లేకపోవడం కడా బాలయ్య సినిమాకు కొంత రిలీఫ్. మొత్తానికి లయన్ కలెక్షన్ల తీరును బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీసు డిజాస్టర్ గా నిలవడం ఖాయమైందని టాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -