Monday, May 20, 2024
- Advertisement -

జయలలిత ఆ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకొందంటే..!

- Advertisement -

ఆస్తులు కేసులో కర్ణాటక హై కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో జయలలిత తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయిపోయారు.

అందుకోసం ఎమ్మెల్యేగా గెలవడానికి ఆమె ఆర్కే నగర్ నియోజకవర్గాన్ని ఎంచుకొన్నారు. మరి “అమ్మ” ప్రత్యేకించి ఈ నియోజకవర్గాన్నే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన రీజన్లే కనిపిస్తున్నాయి.. అవేమిటంటే ప్రధానంగా ఈ నియోజకవర్గం అన్నాడీఎంకేకు కంచుకోట.

గత ఐదు టర్మ్ లుగా ఇక్కడ అన్నాడీఎంకే అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల నడుమ అయినా.. ఆ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఇక్కడ నుంచి అయితే సులభంగా గెలవడానికి అవకాశం ఉంటుందని జయ భావిస్తోంది. ఆమె మొన్నటి వరకూ ప్రాతినిధ్యం వహించిన శ్రీరంగం నియోజకవర్గానికి మళ్లీ వెళ్లి పోటీ చేయవచ్చు. అయితే అదే నియోజకవర్గానికి వరస ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి అవకాశం ఉండదు.

దీంతో అమ్మ  ఈ సారి రూటు మార్చి చెన్నైలో భాగం అయిన ఆర్కేనగర్ నుంచినే పోటీ చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే జయ ఇంత వరకూ ఎప్పుడూ చెన్నైలో భాగమైన నియోజకవర్గాల నుంచి పోటీ చేసింది లేదు. ఆమె రూరల్ ఏరియాలకు వెళ్లి పోటీ చేసి.. వివిధ నియోజకవర్గాల నుంచి గెలుస్తూ వచ్చింది. ఈ సారి మాత్రం భిన్నంగా చెన్నైలో భాగమైన నియోజకవర్గాన్ని ఎంచుకొంది. మరి ఎలాంటి ఫలితాలను పొందుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -