Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి, న‌ట సార్వ‌భౌముడు, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు తెలుగుద‌నానికి ప్ర‌తీక‌. ఆయ‌న తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో స‌గ‌ర్వంగా నిల‌బెట్టిన గొప్ప వ్య‌క్తి సీనియ‌ర్ ఎన్టీఆర్. ఆయ‌న పాల‌న ఎంత గొప్ప‌గా ఉందో.. ఆయ‌న న‌ట‌న ఎంత అద్భుత‌మో.. ఆయ‌న జీవితంలో ఎన్నో మిస్ట‌రీలు కూడా ఉన్నాయి. ఆయ‌న జీవితంలో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఆయ‌న జీవితంలోని చీక‌టి కోణాలు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు చాలా అవ‌స‌రం. అవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలిస్తే కొన్ని పార్టీల‌పై తీవ్ర ప్ర‌భావం ఉంటుంది.

జ‌న‌వ‌రి 18 (గురువారం) ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయ‌న త‌న‌యుడు, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ స్వ‌యంగా త‌న తండ్రి జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న నిర్మాణంలో రూపొందుతున్న సినిమాలో తండ్రిగా బాల‌కృష్ణ‌నే న‌టిస్తున్నారు. ఈ సినిమా మొద‌టి లుక్‌ను విడుద‌ల చేశారు. నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ, కొర్రపాటి సాయి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -