Thursday, May 9, 2024
- Advertisement -

పొలాండ్ బుడ్డోడికి బంప‌రాఫ‌ర్‌

- Advertisement -

ఎక్క‌డో పొలాండ్ దేశంలో ఉన్నా త‌మ‌ మాతృభాష‌ను తెలుగును మ‌ర‌వ‌లేక‌పోతున్నారు. అక్క‌డే స్థిర‌ప‌డినా త‌మ కుమారుడికి మాత్రం తెలుగు భాష‌పై ప‌ట్టుసాధించేలా ఓ తండ్రి తెలుగులో పాట‌లు, డైలాగులు చెప్పిస్తున్నారు. పిల్లాడిని తెలుగులో అదిరిపోయేలా డైలాగ్‌లు, పాట‌లు పాడుతూ అంద‌రీ దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. మొన్న అఖిల్ సినిమా హ‌లోలో మెరిసే మెరిసే పాట‌ను పాడి నాగార్జునను మెచ్చుకున్నాడు. నిన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసిలోని పాట ‘కొడకా కోటేశ్వరరావు’ పాడి ప‌వ‌న్ అభిమానం చూర‌గొన్నాడు. అంతేకాకుండా ప‌వ‌న్‌పై అభిమానంతో ప్ర‌త్యేకంగా ఓ గీతం పాడి అంకితం చేశాడు. దీంతో ఆ పొలాండ్ బుడ్డోడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అంద‌రూ గుర్తుప‌ట్టేంత స్థాయికి ఎదిగాడు. అయితే ఆ బుడ్డోడు ఇప్పుడు మంచి అవ‌కాశం కొట్టేశాడు.

ఆ అబ్బాయి ఎవ‌రంటే పోలండ్‌కు చెందిన బిగ్నీవ్ చెర్టలూర్ (Zbigniew A. Chertlur) (ఏడేళ్లు). బుజ్జిగా గుర్తింపు పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శరత్ చెర్ట‌లూరు కుమారుడు బిగ్నివ్ చెర్ట‌లూర్‌. అతడి తల్లి పొలండ్ దేశస్తురాలు ఉర్సులా ఎలిజ్బెతియా. వీరు పొలండ్‌లో నివ‌సిస్తూ తెలుగు రాష్ట్రాల‌పై ఇంకా అభిమానిస్తున్నారు.

ఆ పిల్లాడు పాట‌లు, డైలాగ్‌ల‌ను మెచ్చిన అహానా పెళ్లంట‌, పూల‌రంగ‌డు, చుట్టాల‌బ్బాయి సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ త‌న త‌ర్వాతి సినిమాలో ఈ బుడ్డోడుకి అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇచ్చాడు. ట్విట‌ర్‌లో ఆ పోలండ్ అబ్బాయికి మెసేజ్ చేశారు. దీంతో బుజ్జి ఉబ్బిత‌బ్బిబ‌వుతున్నాడు. అంతేగాక మొద‌టి అంత‌ర్జాతీయ తొలి తెలుగు రేడియో `టోరీ` ఈ పిల్లాడి ఇంట‌ర్వ్యూ తీసుకోనున్నారు. ఈ రెండు విష‌యాల‌పై బుజ్జి అమితానంతం పొందుతున్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -