Saturday, May 18, 2024
- Advertisement -

జస్ట్ 15లక్షలతో అధ్బుతాన్ని తీశారు..

- Advertisement -

నేటి రోజుల్లో సినిమా తీయాలంటే మినిమమ్ 5 కోట్లు ఉండాల్సిందేరా బుజ్జి అంటాడు ఒకడు. కాదు నేనైతే 3 కోట్లలో తీసేస్తా అంటాడు ఇంకొకడు. ఇంకో మగాడొచ్చి…అదేం లేదు జస్ట్ కోటి ఇవ్వు ఖతర్నాక్ పిక్చర్ తీసి చేతులో పెడతానంటాడు. ఒక సినిమా తీయడానికి ఫీల్డ్ కు కొత్తగా వచ్చే వ్యక్తులు మాట్లాడుకునే మాటలివి.

ఇవన్నీ ఏమీ లేకుండా ఒకతను జస్ట్ 15 లక్షలతో సినిమాను తీసి ఇరగదీసినంత పని చేశాడు. ఇండిపెండెంట్ ఫిలిమ్స్ పతాకంపై లిమిటెడ్ బడ్జెట్ లో మూవీ తీసి తమ సత్తా ఏమిటో చాటుకున్నడు. దీనికోసమని తెలంగాణ పల్లెకథను ఎంచుకున్నాడు. ఆ పల్లె మరేదో కాదు… బందంరెగడ్ . ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల పల్లె. నిర్మల్ కు 20 కిలోమీటర్ల దూరంలోని ఉంటుంది.

ఈ పేరుతో వచ్చిన ట్రైలర్ ఇపుడు యూట్యూబ్ లో వీర విహారం చేస్తుంది. బందంరెగడ్ మూవీ ట్రయిలర్ చూస్తే టెక్నికల్ గానూ మెప్పించేలా ఉండటం విశేషం. 15 లక్షల బడ్జెట్ తో ఆరు రోజుల టైంలో ఈ మూవీ తీశామంటున్నాడు ప్రొడ్యూసర్ నిశాంక్ రెడ్డి. ‘‘బందంరెగడ్ అనేది దానినే ఈ మూవీ టైటిల్ గా పెట్టాం. షూటింగ్ కూడా అక్కడే చేశామని చెబుతున్నారు. ట్రయిలర్ రిలీజ్ చేసిన ఐదు రోజుల్లో మిలియన్ వ్యూస్ రావడం సినిమాకు మంచి ప్లస్ అయింది. మెయిన్ సినిమాకు తీసిపోని విధంగా బందంరెగడ్ ఉంది. ఎవరు కొనకపోతే… యూట్యూబ్ లోనే సినిమా రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. సాహిత్ మోత్కూరి ఈ ఫిలింకి డైరెక్షన్ చేయగా… యువ చంద్ర – ప్రియాంక శర్మ – శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. బాహుబలి టీమ్ లో పనిచేసిన కలరిస్ట్ శివకుమార్ ఈ సినిమాకూ కలరిస్ట్ గా పనిచేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -