Saturday, May 18, 2024
- Advertisement -

చమురు కొట్టేసి…. ఓనర్లయ్యారు…

- Advertisement -

రాజస్థాన్ లో జరిగిన ఓ తాజా సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇద్దరు మామ అల్లుళ్లు చేసిన ఘనకార్యం తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోక మానరు.వారి చేసిన పనేంటో తెలుసా… తాము పని చేసే చోట చమురు కొట్టేయడం.కొట్టేయడం అంటే ఏదో పది ,పదిహేను లీటర్లలో వంద లీటర్లో కొట్టేయడం కాదు..ఏకంగా కోట్ల లీటర్లు కొట్టేయడం. యస్ మీరు నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.

మేనమామ-మేనల్లుడు కలిసి ఐదేళ్లలో ఐదు కోట్ల లీటర్ల ఆయిల్ తాగేశారు. రాజస్థాన్ లోని భూర్ సింగ్ రాజ్ పురోహిత్ – గౌతం సింగ్ రాజ్ పురోహిత్ చమురు శుద్ధి కర్మాగారం నుంచి రోజూ కొన్నివేల లీటర్లు చొప్పున ముడి చమురును సైడ్ చేసేవారు. గత అయిదేళ్లలో అలా కొట్టేసిన చమురు దాదాపు 5 కోట్ల లీటర్లని లెక్క తేలింది.వివరాల్లోకి వెళితే… వేదాంతా గ్రూపునకు చెందిన ‘మంగళ చమురు క్షేత్రం’(ఎంపీటీ) దేశంలోనే అతిపెద్దది.రాజస్థాన్ బార్మర్ జిల్లాలో ఈ భారీ క్షేత్రం ఉంది. ఇక్కడ రోజుకు 1.75 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేస్తుంటారు.

భూర్ సింగ్ – గౌతంసింగ్ 2012 నుంచి ఇక్కడ చోరీని షురూ చేశారు. చమురుతో వచ్చే ట్యాంకర్లు చమురు క్షేత్రంకు వచ్చే ముందు వాటిని సైడ్ చేయడం చేసేవారు. అలా మూడు నెలల క్రితం వరకు డైలీ ఎంతలేదన్నా… 15000 నుంచి 20000 లీటర్ల చమురును దొంగిలించడం మొదలు పెట్టారు. అలా చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన జీపీఎస్ వ్యవస్థకూ ఈ తోడుదొంగలు దొరక్కుండా ఎంతో తెలివిగా చాకచక్యంగా తప్పించుకునేవారు. ఆయిల్ రిఫైనరీ నుంచి లారీని తమ పర్సనల్ షెడ్ కు తీసుకు వచ్చాక….. వెహికల్ కుండే జిపియస్ వ్యవస్థను ఇంకో కారుకు పెట్టి… ఆకారును పంపించేవారు. వీరు మాత్రం ఈ లోపు చమురును దొంగిలించేవారు. ఆ తరువాత పని అయిపోయాక పోతోన్న వెహికల్ దగ్గరకు లారీని తీసుకుపోయి దానిని ఆపి ఆ జిపియస్ వ్యవస్థను యదాతదంగా తమ లారీకి అమర్చి తెలివైన గేమ్ ఆడుతూ బండి లాగించేసేవారు. ఈ ఏడాది జులై 13వ తేదీన ఏదో తనిఖీల్లో భాగంగా ఓ ట్యాంకరు డ్రైవరును పోలీసులు బెదిరిస్తే… అతను తడబడి వీరి గుట్టును బయటకు చెప్పేశాడు.అన్నట్లు ఇంకో విషయం వీరు దొంగిలించిన చమురుతో వచ్చిన డబ్బులతో ఓ కంపెనీ కూగా పెట్టేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -