Thursday, May 2, 2024
- Advertisement -

పవన్ తో సినిమా పై రియాక్ట్ అయిన బండ్ల గణేష్

- Advertisement -

గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టనున్నారు అని, నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని పుకార్లు బయటకు వచ్చాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు అయినందువలన ఈ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా బండ్ల గణేష్ ఈ పుకార్ల పై రియాక్ట్ అయ్యారు. తన నిర్మాణ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే తను నిజంగానే పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా ఆఫర్ చేశానని ఆయన అన్నారు.

కానీ పవన్ కళ్యాణ్ తను మళ్ళీ సినిమాల్లోకి రావడం లేదని ఖరాఖండిగాచెప్పేసారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా చేయడానికి ఒప్పుకునే వరకు తాను ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నారు బండ్ల గణేష్. గతంలో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తీన్ మార్’ మరియు ‘గబ్బర్ సింగ్’ సినిమాలను నిర్మించారు. బాలీవుడ్ సినిమా ‘దబాంగ్’ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను మళ్లీ సినిమాల్లోకి తీసుకు రాగలరో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -