Thursday, May 16, 2024
- Advertisement -

బీకాంలో ఫిజిక్స్ మాజీ ఎమ్మెల్యే వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా…

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ సీఎంగ బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే నామినేటేడ్ ప‌ద‌వులు పొందిన టీడీపీ నేత‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్నారు. బీకాంలో ఫిజిక్స్ ఎందుకుండ‌దు అని చెప్పి న‌వ్వులు పూయించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీమానా చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలగించకముందే ఆయన గౌరవంగా తప్పుకున్నారు.వక్ఫ్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకోకుంటే బలవంతంగా తప్పించాల్సి వస్తుందన్న సమాచారం రావడంతోనే జలీల్ ఖాన్ తన పదవికి రాజీమా చేసినట్లు సమాచారం. వక్ఫ్ బోర్డు పదవి పాములపుట్టగా వ్యాఖ్యానించారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపిన జలీల్‌ఖాన్.. వైఎస్ జగన్ మంచి పాలన అందివ్వాలని ఆకాక్షించారు.విజయవాడ పశ్చిమంలోనే 1600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.21 కోట్లు అందించానని చెప్పారు. కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలను క్రమబద్ధీకరణ చేయించామని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -