తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు పలు చిత్రాలు హిట్ అయిన తర్వాత మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో ‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఆ మద్య కొబ్బరి మట్ట చిత్రంతో మరోసారి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా బర్నింగ్ స్టార్.. బజార్ రౌడి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్.. దాంట్లో రౌడీలు కాదురా దమ్ము, దమ్ము కావాలి’అంటూ సంపూ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది.
ఇక ఈ మూవీకి వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. షాయాజి షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి తదితురలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
