Sunday, May 5, 2024
- Advertisement -

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ‘మర్మాణువు’!

- Advertisement -

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ తర్వాత రొమాంటిక్, ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించారు. వరుస ఫ్లాపుల తర్వాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ మద్య ‘గరుడవేగ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఖల్కీ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా రాజశేఖర్ నటిస్తున్న కొత్త చిత్ర టైటిల్‌ని గురువారం ప్రకటించారు.

పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ‘మర్మాణువు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకుడు.

కాగా, వెంకటేష్ మహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఆకట్టుకుంటున్న సంపూ ‘బజార్ రౌడీ’ టీజర్!

‘జాతిరత్నాలు’ మూవీకి కొత్త కష్టాలు!

నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -