Thursday, May 16, 2024
- Advertisement -

భారీ యాక్షన్ ఎపిసోడ్ తో రవితేజ ‘ఖిలాడి’ ఫోటో వైరల్!

- Advertisement -

కామెడీ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కంచిన ‘రాజాది గ్రేట్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు మాస్ మహరాజ రవితేజ. ఆ తర్వాత సినిమాలతో రవితేజ డిజాస్టర్లను చవిచూశాడు.  ఒకదశంలో తన కెరీర్ కష్టాల్లో పడిందనుకుంటున్న సమయంలో ‘క్రాక్’చిత్రంతో మరో సంచలన విజయం అందుకున్నాడు. క్రాక్ చిత్రం కేవలం రవితేజకు మాత్రమే కాదు.. మాస్ పవర్ ఏంటో చూపించి ఇండస్ట్రీ జనాలకు కొత్త ఊపునిచ్చింది.

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఇంతలా కలెక్షన్లు కొట్టగలదా? అనే అనుమానాలను తిప్పి కొట్టింది. ఇదే ఊపులో ఉన్న రవితేజ ఇప్పుడు ఖిలాడీ దుమ్ము లేపేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా రవితేజ “ఖిలాడి” యాక్షన్ స్టంట్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు షూటింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రవితేజ ఇటలీలోని మిలన్ వీధుల్లో బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తాడు.

బ్లాక్ సూట్ ధరించి, బైక్ పై చేజ్ చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ఈ ఫొటోకు “యాక్షన్ మోడ్ ఆన్, ఖిలాడి” అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు మాస్ మహారాజ. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా నటించారు.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు!

నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్!

ఉగాది కానుక‌గా ‘ఆహా’లో త‌మ‌న్నా ‘లెవన్త్ అవర్’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -