Thursday, May 2, 2024
- Advertisement -

బాహుబలి కన్నా… ఈ తెలుగు సినిమానే పెద్ద హిట్..!

- Advertisement -

ఒకవైపు బాహుబలి సినిమా హిట్ స్థాయి విషయంలో బాలీవుడ్ హీరోలతో పోటీ పడుతోందని ప్రచారం జరుగుతోంది. పెద్ద పెద్ద హీరోల బాలీవుడ్ సినిమాలు కూడా బాహుబలి స్థాయిని అందుకోలేకపోతున్నాయని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతటి విజయాన్ని అందుకొందని చెప్పుకొస్తున్నారు.

అయితే… ఒక రకంగా చూస్తే బాహుబలి కన్నా  ఈ ఏడాదిలో వచ్చిన తెలుగు సినిమాల్లో భలే భలే మగాడివోయ్ పెద్ద హిట్ అని చెప్పాలి. పెట్టిన పెట్టుబడి.. వచ్చిన లాభాలు.. అనే ప్రాతిపదికన తీసుకొంటే బీబీఎమ్ పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా కేవలం ఏడు కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో రూపొందింది. అయితే దాదాపు 28 కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించింది.

షేర్ వేల్యూ 50 కోట్ల రూపాయల స్థాయిలో ఉంది.  28 కోట్ల రూపాయల గ్రాస్ ను బట్టి చూసినా.. ఈ సినిమా నాలుగు రెట్ల లాభాలను సాధించినట్టే. అయితే బాహుబలి షేర్ ను బట్టి చూస్తే.. లాభాలు వచ్చాయి కానీ.. ఇలా నాలుగైదు రెట్ల లాభాలు అయితే లేవు! వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పది కోట్లు సంపాదిచడం కన్నా…

పది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి రెండుకోట్ల రూపాయల లాభాలను సంపాదించడం లాభసాటి వ్యవహారం అవుతుంది కదా! చాలా మంది దృష్టిని ఆకర్షించడంలో బాహుబలి ముందుండవచ్చు కానీ.. లాభాలను లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే..బీబీఎమ్ పెద్ద హిట్ ! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -