Thursday, May 2, 2024
- Advertisement -

నాన్న కాదు.. ఎన్టీఆర్ కు ఆ స్టార్ హీరో పెదనాన్న!

- Advertisement -

కొరటాల శివ సినిమాల్లో కేవలం హీరో పాత్రకే కాదు.. మరో వెటరన్ రోల్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతూ ఉంటుంది. మిర్చి సినిమాలో సత్యరాజ్ కు, ఆ తర్వాత శ్రీమంతుడులో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చాడు ఆ దర్శకుడు. హీరోతో సమానమైన స్థాయి కాకపోయినా.. హీరోయిజం ఆ పాత్రలకు కూడా ఉంటుంది.

అవి ఆయా సినిమాలకు ప్లస్ పాయింట్లే అయ్యాయి. ఆ సినిమాల హిట్స్ లో ఆ పాత్రలకూ భాగస్వామ్యం ఉంది! మరి ఇప్పుడు ఆ దర్శకుడి ముచ్చటైన మూడో సినిమా ఎన్టీఆర్ తో తీయబోతున్నాడు. ఇందులో కూడా తన స్టైల్ ను కొనసాగిస్తున్నాడాయన. ఈ సారి మలయాళ సూపర్ మోహన్ లాల్ కొరటాల శివ మార్కు కీలకమైన పాత్రను పోషించబోతున్నాడు.

ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈసినిమా ఎన్టీఆర్ కు మోహన్ లాల్ నాన్నగా నటించబోతున్నాడని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. అయితే.. అది నిజం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఇందులో మోహన్ లాల్ ది హీరోకి నాన్న పాత్ర కాదు.. హీరోకి పెదనాన్న పాత్ర అని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సారి కొరటాల ఈ రూట్ లో వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మిర్చి సినిమాలో సత్యరాజ్ హీరోకి నాన్నగా కనిపించాడు, శ్రీమంతుడులో జగపతి బాబు  హీరోకి తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ కి తండ్రిగా కనిపించాడు. ఈ సారి మోహన్ లాల్ ను పెదనాన్నగా చూపనున్నాడట కొరటాల!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -