Friday, May 17, 2024
- Advertisement -

‘క‌వ‌చం’గా వ‌స్తున్న బెల్లంకొండ‌

- Advertisement -

టాలీవుడ్ స్టార్ నిర్మాత బెల్ల‌కొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైయ్యాడు.ఈ సినిమాతో డ్యాన్స్‌లు ఫైట్‌లు బాగానే చేస్తున్నాడ‌ని అంద‌రు భావించారు.మొద‌టి సినిమాతో ఫ‌ర్యాలేద‌నింపిచిన బెల్లంకొండ త‌రువాత వ‌రుస ప్లాప్‌ల‌ను అందుకున్నాడు.బోయపాటి దర్శకత్వంలో నటించిన ‘జయ జానకి నాయక’ సినిమాకి కూడా ఏవరేజ్ మార్కులే పడ్డాయి.ప్రస్తుతం ఈ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు మ‌రో సినిమాలో కూడా న‌టిస్తున్నాడు బెల్లంకొండ శ్రీను.

శ్రీనివాస్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.దీనికి ‘కవచం’ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న బెల్లంకొండ లుక్ ని విడుదల చేశారు. పోస్టర్ లో క్రియేటివిటీ పెద్దగా లేకపోయినా.. టైటిల్ మాత్రం క్యాచీగా ఉంది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -