బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచియమై చాలాకాలం అయినా హిట్ మాత్రం రావట్లేదు. అల్లుడు శీను యావరేజ్ టాక్‌తో నడిచింది.తరువాత స్పీడున్నోడు సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమా కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు హిట్ అందించలేకపోయింది.ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ సినిమా చేస్తున్నాడు.లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, శరత్ కుమార్ .. జగపతిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన ఈ కంటెంట్ ను ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదని అంటున్నారు.ఈ సినిమా నుంచి రేపు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో వున్నారు. జూన్ 14వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.