- Advertisement -

బెల్లంకొండ సాక్ష్యం ట్రైల‌ర్‌

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ త‌న సినిమాల‌తో ఎంత దాడి చేస్తున్న హిట్ మాత్రం రావ‌డం లేదు. అల్లుడు శీనుతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన బెల్లంకొండ, ఈ సినిమాతో ఫ‌ర్వాలేద‌నిపించుకున్నాడు. త‌రువాత వ‌చ్చిన స్పీడున్నోడు ఫ్లాప్ అయింది. ఎలాగైనా హిట్ కొట్ట‌ల‌నే క‌సితో మాస్ ద‌ర్శ‌కుడు అయిన బోయ‌పాటితో జ‌య జ‌న‌కి నాయ‌కా సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్‌గా నిల‌బ‌డింది. దీంతో అయోమ‌యంలో ఉన్నా బెల్లంకొండకు చాన్స్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు శ్రీవాస్‌.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టించిన తాజా చిత్రం సాక్ష్యం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు(శ‌నివారం)రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లోనే సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే రీవెంజ్ స్టోరీకి పంచభుత‌లను జ‌త చేసి కొత్త‌గా తీసే ప్ర‌య‌త్నం చేసినట్లు ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే వాడిన‌ట్లు తెలుస్తుంది. సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జంటగా పూజా హెగ్డె న‌టిస్తుంది. సినిమాను ఈ నెల 27న విడుద‌ల చేస్తున్న‌ట్లు ట్రైల‌ర్‌లోనే ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -