Thursday, May 9, 2024
- Advertisement -

బిగ్‌బాస్: ఈ వారం ఎవ‌రు?

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్‌-2 మ‌రో ఎలిమినేష‌న్‌కు రంగం సిద్ధం అయింది. గ‌త‌వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా కిరీటి ఎలిమినేష‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వారం ఎలిమినేష‌న్‌లో తేజస్వి, గణేష్, శ్యామల, నందిని, కౌశల్, బాబు గోగినేని, దీప్తి, గీతా మాధురిలు ఉన్నారు. శ‌ని, ఆదివార‌ల‌లో వ‌చ్చే యాంక‌ర్ నాని త‌న‌దైన శైలిలో హోస్‌మెట్స్‌పై రెచ్చిపోయాడు. ఈ వారం జ‌రిగిన టాస్క్ గురించి హోస్‌మెట్స్‌తో చ‌ర్చించాడు నాని. హోస్‌మెట్ తేజ‌స్వికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక వారం జ‌రిగిన ల‌వ్ గేమ్‌ గురించి అంద‌రితో చ‌ర్చించిన నాని, దీప్తి ఎలిమినేట్ అయితే క‌నుక అది బాబు గోగినేని వ‌ల్లేన‌ని హెచ్చ‌రించాడు.

చెప్పుడు మాట‌లు విని బాబు గోగినేని దీప్తిని ఎలిమినేష‌న్ చేశాడ‌ని నాని చెప్పుకొచ్చాడు. గ‌ణేష్‌ని జాలిగా చూస్తున్నార‌ని, అత‌ను హోస్‌లో ఉండ‌లేక‌పోతున్నాడ‌ని అంద‌రు అందుకే అత‌ను ఎలిమినేట్ చేశారు చెప్పాడు నాని. గ‌ణేష్ హోస్‌లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని ,మీలో ఎవరికైనా చెప్పాడా అని హోస్‌మెట్స్‌ని ప్ర‌శ్నించాడు నాని. మీరు నిజాయితీగా ఉండాల‌ని,మిమ్మల్ని ప్రపంచం మొత్తాన్ని గమనిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి’’ అని నాని చెప్పారు. ఈ వారం ఎలిమినేష‌న్‌లో తేజస్వి, గణేష్, శ్యామల, నందిని, కౌశల్, బాబు గోగినేని, దీప్తి, గీతా మాధురిలు నామినేటైన సంగ‌తి తెలిసిందే. ఇక వారం ఎలిమినేష‌న‌న్‌లో ఉన్న ఎనిమిది మందిలో గణేష్, గీత సేఫ్‌ అని, మిగతా ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం చెబుతానని నాని తెలిపారు.

అయితే నిన్న‌టి వ‌రకు గ‌ణేష్ ఎలిమినేట్ అవుతార‌ని భావించిన అంద‌రికి నాని షాక్ ఇచ్చాడు. గ‌ణేష్‌కు ఓట్లు ఎక్కువుగా రావ‌డంతో అత‌ను సేఫ్ అయ్యాడు. గీత మాధురికి కూడా ఓట్లు ఎక్కువుగా రావ‌డంతో ఆమె కూడా సేఫ్ అయింది. ఇక ఎలిమినేష‌న్‌లో మిగిలింది తేజస్వి, శ్యామల, నందిని, కౌశల్, బాబు గోగినేని, దీప్తి. కౌశ‌ల్ కెప్టెన్ కావ‌డంతో అత‌డు ఎలిమినేట్ అవ‌డం కష్ట‌మే అని చెప్పాలి. తేజస్విపై వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికి ఆమె షోలో ఉంటేనే బాగుంటుంద‌ని నిర్వ‌హాకులు ఆలోచ‌న‌. ఇక మిగిలింది శ్యామల, నందిని, బాబు గోగినేని, దీప్తి. వీరిలో దీప్తి, నందిని ఎలిమినేట్ అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి. దీప్తికి కాస్తో కుస్తో ఫోలోయింగ్ ఉంది, నందిని తెలుగు ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌డంతో ఆమె ఎలిమినేట్ అవుతుందేమో అని అంద‌రు భావిస్తున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో చూడాలి అంటే ఈ రోజు రాత్రి వ‌ర‌కు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -