Thursday, May 9, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో లీకేజీ.. యాంక‌ర్ శ్యామ‌ల క‌ల‌క‌లం

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ లీకేజీ వ్య‌వ‌హారం హాట్ టాపిగ్గా మారింది. బిగ్ బాస్ -2 సీజ‌న్ ప్రారంభంలో అంత‌గా ఆద‌ర‌ణ‌లేద‌నే టాక్ వినిపించినా రాను రాను ఆషో హిట్ టాక్ వైపు దూసుకెళుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు , ఎలిమినేష‌న్స్, కంటిస్టెంట్ ల మ‌ధ్య గిల్లిగజ్జాల‌తో షోను ర‌క్తిక‌ట్టిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ షో వివాదంలో చిక్కుకుంది. రికార్డ్ వీడియోల్ని బిగ్ బాస్ షో ప్ర‌సారం చేస్తుంద‌న్న నెటిజ‌న్ల ఆరోప‌ణ‌ల‌కు ఊతం ఇచ్చేలా కొన్ని సాక్ష్యాలు వెలుగులోకి వ‌చ్చాయి. షో నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తీ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక్కో కంటిస్టెంట్ ఎలిమినేష‌న్ అవుతూ వ‌స్తుంటారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు ఎలిమినేష‌న్ అయిన వారిలో మొద‌టి వారం సంజన, రెండో వారం నూతన్ నాయుడు, మూడో వారం కిరీటి దామరాజు ఉన్నారు. నేటి తో నాలుగో కంటిస్టెంట్ ఎలిమినేష‌న్ ఎవ‌రు అవుతార‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ షో ఈరోజు సాయంత్రం ప్ర‌సారం కావాల్సి ఉండ‌గా… నేటి కంటిస్టెంట్ ఎవ‌రు ఎలిమినేష‌న్ అయ్యారో క‌న్ఫామ్ అయ్యింది. యాంక‌ర్ శ్యామల ఈ వారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా షో ప్ర‌సారం కాకుండా ఆ విష‌యం ఎలా తెలిసింది అనుకుంటున్నారా..? ఇదే విష‌యం యాంక‌ర్ శ్యామ‌ల ట్విట్ చేసింది. తాను షోనుంచి ఎలిమినేట్ అయిన‌ట్లు , ప్ర‌స్తుతం తన కొడుకు ఇషాన్ తో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పేసింది. ప్రస్తుతం యాంక‌ర్ శ్యామ‌ల వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా షో ప్ర‌సారం కాకముందే ఎలిమినేట్ అయిన‌ట్లు చెప్పిన యాంక‌ర్ శ్యామ‌ల‌పై బిగ్ బాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో శ్యామ‌ల ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే ఆమె తన పోస్టును డిలీట్ చేసినప్పటికీ ఆ స్క్రీన్ షాట్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -