బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయ్యాడు. మొదటి సినిమాతో ఫర్వాలేదనిపించుకన్నాడు బెల్లంకొండ. కాని అసలు సీను తరువాతే మొదలైంది. మనోడికి సినిమాలలో అవకాశాలు అయితే వస్తున్నాయి కాని విజయాలు మాత్రం రావడం లేదు. బెల్లంకొండ తాజాగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు, టైటిల్‌ను కూడా విడుదల చేశారు. బెల్లంకొండ కొత్తగా నటిస్తున్న సినిమాను పేరును సీతగా నిర్ణయించారు.
తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సీత అనే టైటిల్ ను బట్టి ఈ చిత్రం హీరోయిన్ ప్రధానంగా సాగుతుందనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. సమ్మర్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడు తేజ కూడా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చాడు. దీంతో ఈ సినిమా తనకు ఖచ్చితంగా హిట్ ఇస్తుందని ధీమగా ఉన్నాడు బెల్లంకొండ. మరి బెల్లంకొండ ఆశలు ఈ సినిమాతో అయిన నెరవెరతాయామో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
