- Advertisement -

‘భేతాళుడు’ మూవీ రివ్యూ!

- Advertisement -
Bethaludu review

‘బిచ్చగాడు’ చిత్రంలో సంచలన విజయం అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ చిత్రం తర్వాత విజయ్ ఆంటోనీ చేసిన చిత్రం ‘భేతాళుడు’.

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రిలీజ్ కు ముందే సినిమాలోని 15 నిముషాల భాగాన్ని విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశాడు ఆంటోనీ. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

దినేష్(విజయ్ ఆంటోనీ) అనే ఒక ఇంటెలిజెంట్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్నట్టుండి ఒక మానసిక రుగ్మతకు గురై ఎవరో తనను వెంటాడుతున్నట్టు భాధపడుతుంటాడు. ఆలా బాధపడుతున్న అతను ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని కలవగా ఆ డాక్టర్ దినేష్ ను పరీక్షించి అతను తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలతో బాధపడుతున్నాడని నిర్ధారిస్తాడు. అలా బాధపడుతున్న దినేష్ తన గత జన్మకు చెందిన జయలక్ష్మి అనే మహిళను వెతుక్కుంటూ వెళుతూ పూర్వ జన్మ జ్ఞాపకాలకు, ప్రస్తుతానికి మధ్య నలిగిపోతుంటాడు. అసలు దినేష్ వెతుకుతున్న ఆ జయలక్ష్మి ఎవరు ? ఉన్నట్టుండి దినేష్ కు తన గత జన్మ ఎందుకు గుర్తొచ్చింది ? ఆ గత జన్మ నైపథ్యం ఏమిటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేదే ఈ భేతాళుడు కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధానగా చెప్పుకోవాల్సింది సినిమా ఫస్టాఫ్ గురించి. సినిమ స్టార్ట్ అవ్వడమే చాలా ఆసక్తి మొదలవుతోంది. స్టార్టింగ్ నుంచే విజయ్ ఆంటోనీ మానసిక సమస్యను ఎలివేట్ చేస్తూ రాసిన సీన్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ హర్రర్ సినిమాలా అనిపించాయి. ఇక విజయ్ ఆంటోనీ నటన ఈ సినిమాకి మరో బలం. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా తెరకెక్కించాడు. ఇక సెకండాఫ్ విజయ్ ఆంటోనీ గత జన్మ తాలూకు కథ ఇంట్రెస్టింగా అనిపించింది.  ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది సెకండాఫ్ గురించి. సెకండాఫ్ ఊహించనంతగా లేదు. పూర్తిగా ఒక మోడ్ లో ఉన్న ప్రేక్షకుడిని ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఉన్నట్టుండి వేరే మోడ్ లోకి తీసుకెళ్లిన ఈ విధానం నిరుత్సాహపరిచింది. ఇక సినిమా క్లైమాక్స్ కూడా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రొటీన్ గానే ఉండటం మరొక మైనస్ పాయింట్. దర్శకుడు ఎక్కడికక్కడ సరైన కారణాలతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పటికీ సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు అసంతృప్తిగానే అనిపించాయి. ఒక రకంగా చెప్పాలంటే దర్శకుడిచ్చిన ముగింపు సరైనదే అయినా సాధారణ ప్రేక్షకుడు ఆశించే రీతిలో లేదు. ఇక మధ్యలో వచ్చే కొన్ని పాటలు కాస్త బోరుకొట్టించాయి.

మొత్తంగా:

ఈ ‘భేతాళుడు’ సినిమా విజయ్ ఆంటోనీ కొత్తగా ట్రై చేసిన సినిమా. ఈ చిత్రంలో ఫస్టాఫ్ కథ, కథనాలు, సెకండాఫ్ కొంత భాగం, విజయ్ ఆంటోనీ నటన ప్లస్ పాయింట్స్ కాగా నెమ్మదించిన సెకండాఫ్ కథనం, ఉన్నట్టుండి కథ ట్రాక్ మారిన విధానం, నిరుత్సాహపరిచే క్లైమాక్స్ లు మైనస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే హర్రర్, థ్రిల్లర్ కథలన్య్ ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -