బంగారం అంటే భారతదేశ మహిళలకు మోజు. ఎంత బంగారం ఉంటే అంత సంపన్నులుగా భారత్‌లో భావిస్తారు. అయితే మన భారత మహిళలతో ఓ హాలీవుడ్ సింగర్ పోటీపడుతోంది. మనవాళ్లు నగలు కొన్ని ఎక్కువ వేసుకున్నా అమ్మవారిలా ఏంటా అవతారం అంటారు. మరీ ఈమె చేసిన పని చూస్తే బంగారు బొమ్మ అనక మానరు.
పాశ్చాత్య పాప్ గాయని బేయాన్స్ నోలెస్ ఓ షోకు మొత్తం బంగారు వస్త్రాలు ధరించి వచ్చేసింది. తన పాదాల చూట్టూ పరుచుకున్న గౌన్ ఆ పరిసరాల్ని బంగారుమయం చేసింది. మొత్తం బంగారు గౌన్‌ను తయారు చేయించుకొని ప్రదర్శన ఇచ్చింది. దీంతో అందరూ ఔరా అన్నారు. ఈ బంగారు గౌన్‌ని భారతీయ సంతతికి చెందిన వారు డిజైనర్స్ ఫాల్గుణి, షేన్ పీకాక్ (భార్యాభర్తలు) రూపొందించారు.
‘వియరేబుల్ ఆర్ట్ గాలా’ రెండో వార్షికోత్సవం సందర్భంగా బంగారు గౌన్‌ని ధరించి బేయాన్స్ తన పసిడి కాంతుల అందంతో, గోల్డ్‌గౌన్‌తో పాల్గొని పాటపాడింది. బేయాన్స్‌తో పాటు ఆమె కూతురు బ్ల్యూ ఇవీ (6 ఏళ్లు) కూడా బంగారంతో రూపొందించిన గౌన్‌ను ధరించి సందడి చేసింది. తల్లితో కలిసి ఇవీ నడిచింది. తల్లీకూతుళ్ల బంగారపు గౌన్‌లు అందాలు చూడడానికి రెండు కళ్లు చాలలేదు.
