Tuesday, May 14, 2024
- Advertisement -

యూట‌ర్న్ అంకుల్‌కు ఘాటా వార్నింగ్ ఇచ్చిన భాజాపా ఎమ్మెల్సీ సోమువీర్రాజు

- Advertisement -

ఏపీకీ కేంద్రం ఏంచేసింద‌నే దానిపై భాజాపా ఛీఫ్ అమీత్‌షా చంద్ర‌బాబ‌కు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కు బాబును ఓమోస్త‌రుగా టార్గెట్ చేసిన రాష్ట్ర క‌మ‌లం నేత‌లు ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచారు. అటు అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ఇటు బ‌య‌ట ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతిపైన విమ‌ర్శ‌ల దాడిని పెంచారు.

తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్ర‌బాబుకు ఘాటు విర్నింగ్ ఇచ్చారు. త‌మ‌ను రాజీనామా చేయాల‌నే ముందు బీజేపీ మద్దతు, సహకారంతో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ముందు రాజీనామా చేయించాలని బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తమ అధ్యక్షుడు అమిత్ షా లేఖలో పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.

టీడీపీ బహిరంగ చర్చకు వస్తే, ఆ లేఖలోని అంశాలపై మాట్లాడేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. అబ్దద్దాలు ఆడాల్సిన కర్మ బీజేపీకి లేదన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు, అమిత్‌షాకు లేఖ రాస్తే మళ్లీ సమాధానం చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ముందుగా తమ మద్దతుతో అధికారం చేజిక్కుంచుకున్న చంద్రబాబుతో రాజీనామా చేయించడం ఉత్తమమని సలహా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -