- Advertisement -

వామ్మో పోలీసులు క‌న్నుకొట్టు పిల్ల ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా..

- Advertisement -

పోలీసులు వాహ‌న‌దారుల‌కు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పాంప్లేట్లు, పోస్టర్లు ఇలా చాలా పద్దతుల్ని ఎంచుకుంటుంటారు. ఇది సాధార‌నం. కాని గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర పోలీసులు మాత్రం వినూత్న ప‌ద్ద‌తుల్ని ఉప‌యోగిస్తున్నారు.

డ్డు భద్రతకు సంబంధించి ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటోను వాడేస్తున్నారు. రాత్రికి రాత్రే సెల‌బ్రిటీగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె కన్ను కొడుతున్న ఫోటో పక్కన రెప్పపాటులో ప్రమాదాలు జరగవచ్చని ఓ కొటేషన్ పెట్టారు. దాని కింద ప్రయాణాల్లో నిర్లక్ష్యం వద్దు… జాగ్రత్తగా వెళ్లండని ట్రాఫిక్ ఏక్ సంస్కార్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

ప్ర‌స్తుతం సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంది ఎక్కువమంది యువతని… ఓవర్ స్పీడ్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాని వడోదరా పోలీసులు వెల్ల‌డిస్తున్నారు. అందుకే వారిలో అవగాహన కల్పించానే ఉద్దేశంతోనే ఇలాంటి వినూత్న ప్రయోగం చేశామని చెబుతున్నారు. యూత్‌లో ఫాలోయింగ్ ఉండేవారి ఫోటోలైతే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసుల ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -