Saturday, May 4, 2024
- Advertisement -

భగవంత్ కేసరి..ఓటీటీ స్పెషల్ అదేనంటా!

- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ పాయింట్‌ని దాటేసింది. తాజాగా సినిమా విడుదలై నెల రోజులు దాటడంతో ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. గత వారం టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో రిలీజ్ తర్వాతా ఫాలో అయిన స్ట్రాటజీనే భగవంత్ కేసరి సినిమాకే ఫాలో అవుతున్నారట. అంటే పబ్లిసిటీని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారట.

ఇక ఎప్పుడులేని విధంగా తొలిసారి స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పారు బాలయ్య. ఈ వెర్షన్‌ని ఓటీటీలో అందుబాటులో ఉంచారు. అర్జున్ రామ్ పాల్ కు ధీటుగా డైలాగులు చెబుతున్న వీడియోలను ఫ్యాన్స్ ఆల్రెడీ షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇక గత పది రోజులుగా పలు చోట్ల స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా షోలు వేసి చూపిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు సత్తాచాటుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -