Monday, May 6, 2024
- Advertisement -

ప్రభాస్..బ్యాక్ టూ బ్యాక్ మూవీస్!

- Advertisement -

నందమూరి బాలృష్ణ సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా తిరుగులేని సత్తా చాటుతున్నారు. బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న షో అన్‌స్టాపబుల్. ఈ షోకి అదిరే రెస్పాన్స్ వస్తుండగా తాజాగా రీసెంట్‌గా యానిమల్ టీం సందడి చేసిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ సరసన రష్మికా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

ఇక ప్రభాస్ సలార్ తర్వాత ప్రాజెక్టు కేతో పాటు మారుతితో రాజా డీలక్స్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాల తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా అనౌన్స్‌చేసి చాలా రోఉలు అయినా ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇక బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి హాజరైన సందీప్ సినిమా గురించిన అప్‌డేట్ ఇచ్చేశారు.

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తిచేయాల్సి ఉందని చెప్పారు. ఇక స్పిరిట్ సినిమా లో ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -