Thursday, May 2, 2024
- Advertisement -

సూర్య కెప్టెన్సీలో భారత్ బోణి..

- Advertisement -

సూర్యకుమార్ యాదవ్‌ కెప్టెన్సీలో భారత్ బోణి కొట్టింది. ఆసీస్‌తో విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ విధించిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 209 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు సూర్యకుమార్‌. సూర్య 42 బంతుల్లో 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 80 పరుగులు చేయగా యశస్వి జైస్వాల్‌ 8 బంతుల్లో 21,ఇషాన్‌ కిషన్‌ 39 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోస్‌ ఇంగ్లిస్‌ 50 బంతుల్లో 8 సిక్స్‌లు,11 ఫోర్లతో 110 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోఇంచారు. స్టీవ్ స్మిత్ 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 హాఫీ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. టీ20ల్లో భారత్‌కు ఇదే (209) అత్యధిక టార్గెట్ చేధన. గతంలో హైదరాబాద్‌లో 208 పరుగుల టార్గెట్‌ని చేధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -