Monday, May 6, 2024
- Advertisement -

బాలయ్య..ఓటీటీ రికార్డులు బ్రేక్!

- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కాంబోలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దసరా రేసులో విజేతగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో రాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ఓటీటీ కోసం ఎప్పుడులేని విధంగా తొలిసారి స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పారు బాలయ్య. ఈ వెర్షన్‌ని ఓటీటీలో అందుబాటులో ఉంచగా రికార్డులన్ని బ్రేక్ చేసింది.

ఇక తెలుగు వెర్షన్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉండటమే కాదు రికార్డు వ్యూస్‌ని రాబట్టగా హిందీ వెర్షన్ నెంబర్ 3 ట్రెండింగ్‌లో ఉంది. అలాగే గూగుల్ సెర్చ్‌లో కూడా భగవంత్ కేసరి టాప్‌లో ఉంది. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్న బాలయ్య సినిమా గురించి సెర్చ్ చేస్తుండటం విశేషం.

సనషైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య …బాబీతో 109లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -