Saturday, May 18, 2024
- Advertisement -

‘శ్రీమంతుడు” రికార్డులను తుడిచేసిన నాని..!

- Advertisement -

కలెక్షన్ల స్లామినా విషయంలో ఒక తెలుగు సినిమా మరోదాన్ని మించి పోతోంది. ఒకదాని తర్వాత మరొకటిగా వస్తున్న ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

అంతిమంగా ఇండస్ట్రీ పరిధిని పెంచుతున్నాయి. తాజా విషయం ఏమిటంటే.. గత వారంలో విడుదల అయిన నాని సినిమా “భలే భలే మగాడివోయ్” ఓవర్సీస్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే ఏకంగా నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం తొలి మూడు రోజుల్లో శ్రీమంతుడు సినిమా సాధించిన దాని కన్నా ఎక్కువ!

పాజిటివ్ అంచనాల మధ్య విడుదల అయిన నాని సినిమా ఓవర్సీస్ లో బెనిఫిట్ షోల తోనే అరకోటి రూపాయల వరకూ వసూలు చేసింది. విడుదల తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ ఈ సినిమాకు ప్లస్ పాయింటయ్యింది. పాజిటివ్ రివ్యూలు కలిసిరావడంతో ఈ సినిమా కు కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో మూడురోజుల్లోనే ఏకంగా 4.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది ఈ సినిమా. మరి ఈ విధంగా చిన్న హీరో అనిపించుకొన్న నాని ఒక్కసారిగా మగాడిలా రెచ్చిపోయాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో కొత్త రికార్డులను సృష్టించేస్తున్నాడు.

అంతే కాదు ఇది వరకూ ఈగ సినిమాతో తన పేరు మీద ఉన్న రికార్డును నాని ఇప్పుడు అధిగమించే అవకాశాలున్నాయి. ఈగ సినిమా విదేశాల్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలను వసూలు చేసింది. మగాడివోయ్.. జోరు చూస్తుంటే ఆ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -