Saturday, May 18, 2024
- Advertisement -

మూడవ షెడ్యూల్ మొదలైన సర్దార్ గబ్బర్ సింగ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ షూటింగ్ మొదలు పెట్టడం అంటే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు పవన్ అభిమానులు, ఒక పట్టాన సినిమా షూటింగ్ మొదలు పెట్టి దాన్ని కంప్లీట్ చెయ్యడు అని పవన్ ఫాన్స్ సైతం పవన్ మీద ఒక్కొక్కసారి అసహనం తో ఉంటారు.

అత్తారింటికి దారేది తరవాత అంటే రెండేళ్ళ కంటే ఎక్కువ వ్యవధి తరవాత పవన్ చేస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇదే కావడం తో ఫాన్స్ రెండేళ్ళు వెయిట్ చేయించినందుకు అసహనం గా కూడా ఉన్నారు. మధ్యలో గోపాలా గోపాలా వచ్చినా ఆ సినిమా వెంకటేష్ ఖాతాలో పడిపోవడం తో ఇక కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ని నెక్స్ట్ సినిమా గా ఫిక్స్ అయ్యారు. 

ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ కి వెళ్ళబోతున్న ఈ చిత్రం ఇవాళ నుంచీ రామోజీ ఫిలిం సిటీ లో మొదలు కాబోతోంది అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు విలన్ కబీర్ దుహ సింగ్ కూడా జాయిన్  అవుతున్నాడు. కాజల్ కూడా ఈ షెడ్యూల్ ఆఖర్లో రావచ్చు అంటున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ గుజరాత్ కి షిఫ్ట్ కానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ త్వరగా సినిమా కంప్లీట్ చేసి సంక్రాంతి కి విడుదల చేసి ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెడతాడు అని ఆశిద్దాం 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -