Thursday, May 16, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ … సొంత కొడుకునే అనుమానిస్తున్నాడా?!

- Advertisement -

ఇదీ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సొంత తనయుడి మీదే అనుమానాలున్నాయని వారు అంటున్నారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఈ  సంచలన ఆరోపణ చేశాడు. కేవలం కొడుకు మీదే కాదు..

కూతురు, మేనల్లుడుల విషయంలో కూడా కేసీఆర్ కు అనుమానాలున్నాయని పొన్నం అంటున్నాడు. మరి ఎందుకు ఆ అనుమానం? ఏమిటా అనుమానం? అంటే… వారి ఆధ్వర్యంలో తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ కు అనుమానం, భయాలున్నాయని కాంగ్రెస్ నేత అంటున్నాడు.

ప్రస్తుతం కేసీఆర్ చైనా పర్యటనలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. తనయుడు కేటీఆర్ , లేదా తనయ కవిత ఆమె కూడా కాకుంటే మేనల్లుడు హరీష్ రావు ఆధ్వర్యంలో తన మీద తిరుగుబాటు జరుగుతంది.. .. వారు తన చేతుల నుంచి అధికారాన్ని లాగేసుకొంటారని కేసీఆర్ కు అనుమాలున్నాయని అందుకే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కేసీఆర్ తన వెంట తీసుకెళ్లాడని కాంగ్రెస్ పార్టీ అంటోంది!

స్పీకర్ ఇక్కడే ఉంటే.. కూతురు లేదా కొడుకు మేనల్లుడు హరీష్ రావు ఆధ్వర్యంలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని భయపడి కేసీఆర్ ఆయనను తన వెంట తీసుకెళ్లాడనికాంగ్రెస్ అంటోంది. మరి సాధారణఃంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు స్పీకర్ ఆయన వెంట ఉండటం అరుదుగానే జరుగుతుంటుంది. ఏపీ సీఎం విదేశాలకు వెళ్లినప్పుడు తన వెంట స్పీకర్ కోడెలను తీసుకెళ్లలేదు. అయితే కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో కాంగ్రెస్ కు ఈ విషయంలో ఆరపణలు చేయడానికి అవకాశం ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -