Monday, May 6, 2024
- Advertisement -

ఫిదాలో హీరోయిన్ అక్కగా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?

- Advertisement -

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఫిదా. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అనుకోకుండా వచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని రెంజ్ లో సక్సెస్ అయ్యింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య సాగే అందమైన లవ్ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి అద్భుతమైన మార్కులు పడుతున్నాయి.

ఇక ఈ మూవీలో హీరోకు వదినగా.. హీరోయిన్ కి అక్కగా శరణ్యా ప్రదీప్ అనే అమ్మాయి నటించి.. తెలుగవారి హృదయాలను దోచుకుంది. తన చక్కని సహజమైన నటనతో రేణుక పాత్రకు పూర్తి న్యాయం చేసిందని చెప్పాలి. హీరో లైక్ చేసే వదినగా, తండ్రికి బాధ్యతగల పెద్ద కూతురిగా, చెల్లెలికి ఇష్టమైన అక్కగా, భర్తకు అణకువ గల భార్యగా… శరణ్యా చాలా బాగా నటించింది. అమాయకత్వం ఉట్టిపడే ఈ ఫిదా వదిన శరణ్యా ప్రదీప్ నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్ కు చెందినది. అప్పట్లో ఓ టీవీ చానెల్ లో యాంకర్ గా చేసిన ఈమె ఆ తర్వాత కూడా యాంకర్ గా కొంత కాలం చేసింది.

ఆ టైంలోనే ఫిదా మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని.. అక్కడికి వెళ్లి.. ఆడిషన్ ఇచ్చి సెలక్ట్ అయ్యింది. నిజామాబాద్ అమ్మాయి కావడం దానికి తోడు తెలంగాణ యాస బాగా వచ్చి ఉండటం.. ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఇక మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్.. మొదటి నుంచి ప్రయోగాలకే ప్రాధాన్యత ఇస్తూ మంచి మంచి పాత్రలు చేస్తున్నాడు. కంచె మొదలు ఫిదా వరకు ఒక్కొక్క సినిమాలో ఒక్కోక్క వైవిద్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఫిదాలో ఎమోషన్ సీన్స్ చాలా అద్భుతంగా చేశాడు వరుణ్ తేజ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -