Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్… వైసీపీలోకి టీటీడీ చైర్మ‌న్..?

- Advertisement -

వైసీపీ వైపు టీడీపీ సీనియ‌ర్లు వలసలకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రాదని.. తమకి టీడీపీలో టికెట్లు రావని వైసిపీలోకి మాకాం మార్చే పనిలో ఉన్నారు. మొన్నటివరకు వైసీపీ నుంచి టీడీపీకి వ‌ల‌స‌లు సాగాయి. ఇప్పుడు టీడీపీకి షాక్ తగిలేలా.. సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఇక టీడీపీలో సీనియ‌ర్ నేత‌ చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి వైసీపీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి స‌ర్పంచ్ గా గెలిచిన చ‌ద‌ల‌వాడ, ఆ త‌ర్వాత శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆ త‌ర్వాత 1999లో టీడీపీలో చేరిన కృష్ణ‌మూర్తి తిరుప‌తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.అప్ప‌టినుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న లేకున్న చంద్ర‌బాబుకు అండ‌గా నిలిచాడు చ‌ద‌ల‌వాడ‌. ఇక తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నేత వెంక‌ట ర‌మ‌ణ టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌టంతో చ‌ద‌ల‌వాడ‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. 2014 ఎన్నిక‌ల్లో సీటు కోసం ఇద్ద‌రు పోటీ ప‌డ్డారు.కానీ చివ‌రి నిమిషంలో వెంక‌ట‌రమ‌ణ‌కే టికెట్ ల‌భించింది.ఇక దాంతో మ‌న‌స్థాపానికి గురైన చ‌ద‌ల‌వాడ‌కు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చి చ‌ల్ల‌బ‌ర్చాడు చంద్ర‌బాబు. ఇక 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రావ‌టం,చ‌ద‌ల‌వాడ‌కు టీటీడీ చైర్మ‌న్ పోస్టు ఇవ్వ‌టం జ‌రిగింది. కానీ చైర్మ‌న్ అయ్యాక టీడీపీని మ‌రిచిపోయిన‌ట్లుగా వ్య‌వ‌హరిస్తున్నాడ‌ట కృష్ణ‌మూర్తి.

చంద్ర‌బాబు తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు కూడా పెద్ద‌గా పట్టింపు లేద‌న‌ట్లుగా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయార‌ట కృష్ణ‌మూర్తి. ఎమ్మెల్యే కాదు కదా.. అన్న భావనే ఇందుకు కారణమో.. లేక టికెట్ ఇవ్వ‌లేద‌న్న క‌సో తెలియ‌దు కానీ,టీడీపీకి పూర్తిగా అంటిముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ట‌. దీని తోడు ఆయన త్వరలో పదవీకాలం ముగియనుంది. ఇక మ‌రోసారి టీటీడీ చైర్మ‌న్ గా త‌న‌నే కొన‌సాగించేందుకు టీడీపీ ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని తెలిసిపోతుంది. అందుకని చ‌ద‌ల‌వాడ టీడీపీకి పూర్తిగా దూర‌మ‌వుతాడ‌ని,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాడని,త్వరలోనే పార్టీ మారతాడని చిత్తూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -