Saturday, April 27, 2024
- Advertisement -

కల్కిలో విలన్‌ పాత్రపై కమల్!

- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,దిశా పటాని, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక విలన్‌గా నటిస్తున్నారన్న వార్తలు రాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్ .

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను ఇండియన్ 2,ఇండియన్ 3 షూటింగ్ పూర్తి చేశానని త్వరలో మణిరత్నం థగ్ లైఫ్ షూట్ లో పాల్గొని పూర్తి చేస్తానని చెప్పారు. కల్కిలో గెస్ట్ గా చేస్తున్నాను..ఎవరూ ఊహించని పాత్రగా ఇది ఉంటుందన్నారు. నాగ్ అశ్విన్ తన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పారు.

ప్రభాస్ విష్ణుమూర్తి పాత్రలో కనిపించనుండగా ఈ సినిమా కథ మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి కల్కి 2898 AD అనే టైటిల్ ఖరారు చేశారని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -