Tuesday, April 30, 2024
- Advertisement -

మిడిల్ క్లాస్ అబ్బాయ్‌కి భూమిక ఏమ‌వుతుంది?

- Advertisement -
  • ఎంసీఏలో భూమిక ప్ర‌ధాన పాత్ర‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడంతా మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) గురించే టాక్ వినిపిస్తోంది. గ‌త రెండు నెల‌లుగా ప‌రిశ్ర‌మ‌కు స‌రైన హిట్ అల్లాడుతున్న ప‌రిశ్ర‌మ‌కు నాని ఊపిరి ఇస్తాడ‌ని అనుకుంటున్నారు. నాని సినిమాపైనే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్త రోజుకొక‌టి బ‌య‌ట‌కు వ‌స్తూ ఇంకా ఆస‌క్తి పెంచుతున్నారు.

న్యాచుర‌ల్ స్టార్ నాని ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవితో క‌లిసి మిడిల్ క్లాస్ అబ్బాయ్‌గా ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించేందుకు వ‌స్తున్నారు. దీనికితోడు సూప‌ర్ హిట్ సినిమాలు అందిస్తున్న దిల్ రాజు స‌మ‌ర్పిస్తుండ‌డంతో ఈ సినిమాపై అంద‌రీ దృష్టి ప‌డింది. ‘ఎంసీఏ’ సినిమాకు బంపర్ క్రేజ్ వ‌స్తోంది. క్రిస్మస్ బ‌రిలో ఎన్నో సినిమాలు వ‌స్తున్నా ఈ సినిమాపైనే అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అక్కినేని అఖిల్ ‘హలో’గా వ‌స్తున్న ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇంత‌కీ ఈ సినిమాలో త‌లుక్కున్న మెరుస్తున్న తార ఎవ‌రంటే భూమిక‌. భూమిక హీరోయిన్‌గా వెల‌గి వివాహానంత‌రం కుటుంబ జీవితానికి ప‌రిమిత‌మైన ఆమె ధోని సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి పునఃప్ర‌వేశం చేసింది. అయితే ఎంసీఏ సినిమాలో నాని ప‌క్క‌న న‌టిస్తోంది. అయితే ఈ సినిమాలో అన్న-వదినల బంధం నేపథ్యంలో ఉంటుంద‌ని తెలుస్తోంది. భూమిక నానికి వ‌దిన‌గా న‌టిస్తోంద‌ని టాక్‌.దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమా తీస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర్ క్రియేష‌న్స్ ప‌త‌కంపై సినిమా వ‌స్తోంది. దేవీశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ నిర్మాత‌లుగా వ్య‌హ‌రిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -