Monday, April 29, 2024
- Advertisement -

కాంచ‌న‌-3లో బిగ్‌బాస్ హీరోయిన్‌

- Advertisement -

ఒవియాతో లారెన్స్ సినిమా

థియేట‌ర్ల‌లో ఇప్పుడు థ్రిల్ల‌ర్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థాంశంతో కూడిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను సీట్ల‌పై కూర్చోపెడుతున్నాయి. ఆ సినిమాలు ఒక్క‌టితోనే ఆగ‌డం లేదు. వాటి సిరీస్‌లు రెండు, మూడు అంటూ తీస్తున్నారు. కాంచ‌న‌గా వ‌చ్చిన సినిమా సిరీస్‌లు వ‌రుస పెట్టి వ‌స్తున్నాయి. రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి న‌టించి వ‌స్తున్న సినిమాలు ఇప్ప‌టికే రెండు వ‌చ్చాయి. ఇప్పుడు మూడోది వ‌స్తోంది.

రాఘవ లారెన్స్ తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమా ‘కాంచ‌న‌’. హార్రర్ కామెడీ జానర్‌కు గొప్ప డిమాండ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ‘ముని’కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ట‌య్యింది. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన కాంచ‌న-2 (గంగ) కూడా బాగానే ఆడింది. ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీని కొనసాగిస్తూ.. లారెన్స్ ఇప్పుడు కాంచ‌న-3 తీస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే సైలెంటుగా ఈ సినిమా షూటింగ్ లారెన్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

తమిళ ‘బిగ్ బాస్’ షోతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న సెన్సేషనల్ హీరోయిన్ ఒవియా ‘కాంచ‌న-3’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. లారెన్స్‌తో కలిసి ఒవియా షూటింగులో పాల్గొంటున్న సందర్భంగా ఆన్ లొకేషన్ పిక్ కూడా ఒకటి బయటికి వచ్చింది. ‘బిగ్ బాస్’ తర్వాత ఒవియా పాపులారిటీని వాడేసుకుందామని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆమె ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది. ఒవియా రీఎంట్రీలో ఎంచుకున్న పెద్ద సినిమాల్లో ఇదొకటి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -