Tuesday, May 14, 2024
- Advertisement -

సెహ్వాగ్ డ‌బుల్ సెంచ‌రీ సునామీకి ఆరేళ్లు పూర్తి….

- Advertisement -

ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ.. వన్డే కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీతో పాటు ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు తన గురువు సచిన్‌ పేరిటి ఉన్న ఈ రికార్డును అధిగమించాడు.

డిసెంబరు 8, 2011 స‌రిగ్గా ఇదే రోజు ఇండోర్ వేదికగా భారత్-విండీస్ మధ్య నాలుగో వన్డే జరుగుతోంది. అభిమానులతో స్టేడియం నిండిపోయి ఉంది. టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ నిదానంగా ఆడుతున్నాడు. అంతలోనే ఏమైందో ఏమో.. శివాలెత్తిపోయాడు. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. విండీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బంతి వేయాలంటేనే వణికేలా చేశాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదుతూ వీర విహారం చేశాడు. అతడి ఆటకు స్టేడియంలోని ప్రేక్షలకుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు మంత్రముగ్ధులయ్యారు.

మొత్తం 149 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ 25 ఫోర్లు, ఏడు సిక్సర్లతో (219 పరుగులు) డబుల్ సెంచరీ చేసి వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న రికార్డును తుడిచివేయడంతో పాటు వన్డేల్లో రెండో ‘డబుల్’ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతేకాదు.. అప్పటికి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా కూడా తన పేరును లిఖించుకున్నాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ రికార్డును టీమిండియాకే చెందిన రోహిత్ శర్మ (264 పరుగులు) అధిగమించాడు. సెహ్వాగ్ వీర విహారం చేసిన ఈ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -