Tuesday, May 7, 2024
- Advertisement -

బిచ్చగాడు – ఇదొక సినిమా

- Advertisement -

‘బిచ్చగాడు’ అని టైటిల్ పెట్టుకుని తెలుగులో ఓ సినిమా వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా..? కానీ త్వరలోనే ఈ పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఐతే అది డైరెక్ట్ తెలుగు సినిమా కాదు. తమిళం నుంచి అనువాదమవుతున్న చిత్రం.

మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ఇది. ఇంతకుముందు నకిలీ.. సలీమ్.. సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు విజయ్ ఆంటోనీ. అతను హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘పిచ్చైకారన్’ తమిళంలో సూపర్ హిట్టయింది. తెలుగులో ‘శీను’ సినిమా చేసిన సీనియర్ డైరెక్టర్ శశి రూపొందించిన సినిమా ఇది. బిలియనీర్ అయిన హీరో ఓ ప్రమాదం వల్ల కోమాలోకి వెళ్లిపోయిన తన తల్లిని మామూలు మనిషిని చేయడం కోసం ఓ స్వామీజీ ఆదేశాల ప్రకారం 48 రోజుల పాటు బిచ్చగాడిగా మారి జీవనం సాగిస్తాడు. ఆ 48 రోజుల్లో అతను ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు శశి. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది.  ఇది తెలుగలో తీస్తున్నారు .

{youtube}SB83WmWw4RI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -