Wednesday, May 8, 2024
- Advertisement -

చంద్రబాబు మూర్ఖత్వం..

- Advertisement -

ప్రత్యెక హోదా మంటలు మళ్ళీ రాజుకున్నాయి. కేంద్రం ప్రత్యెక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేనే లేదు లైట్ తీస్కోండి అని నిన్నటికి నిన్న మొఖం మీదనే చెప్పెయ్యడం తో మళ్ళీ ఎవరి దారిలో వారు గొడవ మొదలు పెట్టారు.

ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయం లో చంద్రబాబు మీద యమా సీరియస్ గా ఉన్నారు. అదేదో కేంద్రం తప్పు అన్నట్టుగా కవర్ చేసుకోవడం మూర్ఖత్వం అని జగన్ విరుచుకుని పడ్డారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఒస్తుందా అనే విషయం చంద్రబాబు ని ఎన్నిసార్లు అడిగినా ఒస్తుంది అన్నారు అని ఇప్పుడు మరి ఆయన దీనికి సమాధానం ఏం చెపారు అన్నారు జగన్. రాష్ట్ర విభజనప్పుడు ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు.. బీజేపీ అంతా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు. అంటున్నారు జగన్. విభజన కారణంగా జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు అని అందులో చంద్రబాబు భాగం ఎక్కువ అని జగన్ కోప్పడ్డారు. . ప్రత్యేక హోదా వస్తే.. ఏపీలో పరిశ్రమలు పెట్టటానికి సంబంధించి అనేక రాయితీలు లభిస్తాయి.

అదే జరిగితే ఆదాయపన్ను.. ఎక్సైజ్ డ్యూటీ.. సగం రేటుకే విద్యుత్.. రవాణా ఖర్చులో సగం తగ్గుతుంది. ఇవన్నీ ఉంటే.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులే క్యూలో నిలుచుంటారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం చంద్రబాబు అక్కడికి వెళుతున్నా  ఇక్కడికి వెళుతున్నా అని చెప్పడం మానేసి చక్కగా ప్రత్యేక హోదా కోసం పోరాడితే మన దగ్గరకే పెట్టుబడులు ఒస్తాయి అంటున్నారు జగన్. చంద్రబాబు మూర్ఖత్వం వల్లనే పరిస్థితి ఇలా ఉంది అన్నారు ఆయన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -