Monday, May 6, 2024
- Advertisement -

మోడీ వర్సెస్ బాబు…… పచ్చ బ్యాచ్ గాలి తీసేసిన నేషనల్ సర్వే

- Advertisement -

చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ నాయకులు, టిడిపి భజన మీడియా అంతా కూడా మోడీని ఎదుర్కునే నాయకుడు చంద్రబాబే అని చెప్తూ ఉంటారు. మోడీకంటే సీనియర్‌ని, నా ముందు మోడీ ఎంత అని చంద్రబాబు కూడా తెలుగు మీడియా ముందు రెచ్చిపోతూ ఉంటాడు. అఫ్కోర్స్……ఢిల్లీలోనో, వేరే ఎక్కడైనా మోడీ ఎదురుపడితే ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా మైమరిచిపోతూ……..మోడీ కనుసైగ, చేతి స్పర్శ కోసం ఇదే చంద్రబాబు తహతహలాడిపోతారనుకోండి. ఆ విషయం పక్కన పెడితే మోడీకి సరైన పోటీ మేమే………..మేం చెప్పబట్టే కర్ణాటకలో కూడా ప్రజలు మోడీని దెబ్బకొట్టారు అని చెప్పుకునే పచ్చ బ్యాచ్ వాదనలో నిజం ఎంత? మోడీకి ధీటైన ప్రత్యర్థి చంద్రబాబే అన్నంత రేంజ్‌లో బిల్డప్ ఇస్తున్న పచ్చ బ్యాచ్ ప్రచార ఆడబరంలో నిజం ఎంత? అన్న విషయంపై ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది.

అఫ్కోర్స్……..ఆ ఫలితం ఏంటో చంద్రబాబు, ఆయన భజన మీడియా ప్రచార పటాటోపం గురించి తెలిసినవాళ్ళు ఇప్పటికే చెప్తూనే ఉన్నారు. బాబుకు జాకీలేసి లేపే ఆయన భజన మీడియా ప్రచారాన్ని గుడ్డిగా నమ్మే జనాలకు కూడా ఇప్పుడు ఒక సర్వే కనువిప్పు కలిగించింది. మోడీని ఎదుర్కునే ధీటైన నాయకుడు ఎవరు అంటే ఒక్కరికి కూడా టాప్ రేంజ్ మార్కులు వచ్చింది లేదు. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలాంటి వాళ్ళు కనీసం పోటీలో అయినా నిలబడ్డారు. మోడీతో లోపాయికారి పొత్తు పెట్టుకుని ఉన్నాడు అని టిడిపి నాయకులు కూడా విమర్శించే కెసీఆర్ కూడా మోడీకి సరైన ప్రత్యర్థి అనే విషయంలో చంద్రబాబు కంటే ఎక్కువ స్కోర్ సాధించాడు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో మోడీకి సరైన ప్రత్యర్థి ఎవరు అని చెప్పి జాతీయస్థాయి సంస్థ ఇండియా టుడే చేసిన సర్వేలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చంద్రబాబును మోడీకి సరైన ప్రత్యర్థిగా చూశారు.

నాలుగేళ్ళపాటు మోడీతో అంటకాగి అన్ని వ్యక్తిగత ప్రయోజనాలు పోందిన చంద్రబాబు, కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన టిడిపి నాయకులు కేవలం 2019 ఎన్నికల్లో ఓట్ల కోసమే మోడీతో వేరయినట్టుగా నటిస్తున్నారని, ఎన్నికలవగానే మళ్ళీ మోడీతో కలవడం గ్యారెంటీ అన్న అభిప్రాయాలు వినిపించాయి. మోడీకి ప్రత్యర్థిగా నిల్చునేంత సీన్ చంద్రబాబుకు లేదని సర్వేలో పాల్గొన్న జనాలు తేల్చేశారు. ఆ రకంగా చంద్రబాబు దగ్గర నుంచీ టిడిపి నాయకులు, పచ్చ మీడియా మొత్తం కూడా మోడీ వర్సెస్ చంద్రబాబు అని ఓ స్థాయిలో చేస్తున్న ప్రచార జిమ్మిక్కుల గాలిని నిలువునా తీసేశారు. ఈ సర్వే దెబ్బతో చంద్రబాబుకు ఉన్న క్రేజ్ కూడా పోయినట్టుగా ఉందన్న నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో టిడిపి నేతలు ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -