Thursday, April 25, 2024
- Advertisement -

రెండు ప్రేమ‌లు, రెండు పెళ్లిల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది పూజా రామ‌చంద్ర‌న్‌.పూజా రామచంద్రన్ మొదటి రెండు వారాలు ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించింది. ప్రతి టాస్క్ లో కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాని ఆ తర్వాత కాస్త డల్ అయ్యింది.త‌ను ఎంట్రీ ఇచ్చిన మూడో వారంలోనే బ‌య‌టికి వ‌చ్చేసింది పూజా.పూజా బ‌య‌టికి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆమెకు తెలుగు రాక‌పోవ‌డ‌మే,ఇంకా పూజా తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రిజిస్టార్ కాక‌పోవ‌డం వ‌ల్ల ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌యటికి వ‌చ్చేసింది.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నప్ప‌టికి తాజాగా ఆమె వ్య‌క్తిగ‌త జీవితం గురించి సోష‌ల్ మీడియాలో విప‌రీతమైన చ‌ర్చ న‌డుస్తుంది.

పూజా రెండు పెళ్లిల్లు చేసుకుందని కొందరు – మూడు పెళ్లిల్లు చేసుకుందని మరికొందరు ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా తన వ్యక్తిగత విషయాలపై మీడియాలో వస్తున్న పుకార్లకు ఒక ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది పూజా.తాను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాని అత‌నితో విభేదాలు రావ‌డంతో రెండున్నర సంవత్సరాల క్రితం విడాకులు తీసుకోని విడిగా ఉంటున్న అంటూ చెప్పుకొచ్చింది పూజా. ప్రస్తుతం తన జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడని తెలిపింది.అత‌ను నేను ప్రేమించికుంటున్నామ‌ని త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని చెప్పుకొచ్చింది.ప్ర‌స్తుతం పూజా నటుడు జాన్‌తో ప్రేమలో ఉందని అతడితో సహజీవనం కూడా సాగిస్తున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -