Saturday, May 18, 2024
- Advertisement -

ఏపీప్ర‌భుత్వానికి, హైకోర్టుకు సుప్రీం నోటీసులు…

- Advertisement -

ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌పై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి, హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు విభజనపై కేంద్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం (ఆగస్టు 31) విచారణ జరిగింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేర్వేరుగా ఎందుకు హైకోర్టులు ఏర్పాటు చేయకూడదంటూ కేంద్రం తన పిటిషన్‌లో పేర్కొంది. 2015, మే 1న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోర్టును కోరింది.హైకోర్టు విభజన ఇక ఎంతమాత్రం జాప్యం కావడానికి వీలులేదని తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, విభజన జరగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌లు వాదించారు.

ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది.ఇప్పుడున్న హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ స్పష్టం చేసింది.

కేంద్రం వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలంగాణ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు స్పష్టం చేశారు. చట్టసభలు, అధికారుల విభజన జరిగింది.. కానీ న్యాయవ్యవస్థ విభజన జరగలేదని ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ వైఖరి తెలియజేయాలని జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -