Friday, May 3, 2024
- Advertisement -

నానిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన తేజ‌స్వీ

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు రోజుకి మరింత మ‌సాలా జోడిస్తున్నారు.బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా తేజస్వి బ‌య‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.అయితే ఇక్క‌డే అస‌లు స‌మస్య మొద‌లైంది.తేజ‌స్వీ బ‌య‌టికి వ‌చ్చి రావ‌డంతోనే బిగ్‌బాస్‌పై విమ‌ర్శ‌లు చేసింది.టీఆర్ఫీ రేటింగ్స్ కోసం బిగ్‌బాస్‌లో నన్ను నెగెటివ్‌గా చూపించారంటూ చెప్పుకొచ్చింది.రోజులో 24 గంటల్లో జరిగిన దాంట్లో వాళ్లకు నచ్చిన గంట సేపు ఎడిట్ చేసి ఆడియన్స్ కు చూపిస్తున్నారు.కౌశల్ విషయంలో ఒక ఇష్యూ అయింది దానికి సారీ కూడా చెప్పాను.

కానీ హౌస్ లో తన ప్రవర్తన మాత్రం నాకు నచ్చేది కాదు, తను స్వార్ధపరుడు. కౌశల్ విషయం కానివ్వండి, మరో విషయం కానివ్వండి, నాని రెండు, మూడు వారాలుగా నాకు క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. మొదట రెండు వారాలు నిజమేనేమో నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానేమో అనుకున్నా.. ఆ తరువాత కొంచెం సైలెంట్ గా ఉన్నా.. మళ్లీ నాని నన్ను తిట్టారు. అప్పుడు అర్ధమైంది నాని కూడా నన్ను మోసం చేస్తున్నారు అని.నేను కోప్పడే సందర్భాలు, గొడవ పడే విషయాలే చూపించి ఆడియన్స్ దృష్టిలో నన్ను బ్యాడ్ చేసేశారు. భాను, శ్యామల కూడా నా గురించి నెగెటివ్ గా మాట్లాడడం తెలిసి చాలా బాధప‌డ్డాను.బిగ్‌బాస్‌కు వెళ్లి త‌ప్పు చేశాన‌ని చెప్పుకొచ్చింది తేజ‌స్వీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -