Tuesday, May 14, 2024
- Advertisement -

25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ సెంచరీ

- Advertisement -

శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌ను వైట్‌వాష్ చేయించుకుంది దక్షిణాఫ్రికా .అయితే రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ బ్రుయిన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడినప్పటికి బ్రుయిన్‌ తన సాయశక్తుల పోరాడి సెంచరీ సాధించాడు.

దీంతో 25 ఏళ్ల తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో శతకం బాదిన రెండో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా బ్రుయిన్‌ రికార్డు నెలకొల్పాడు. 1993లో ఫీల్డింగ్‌ దిగ్గజం జాంటీ రోడ్స్‌ ఇదే శ్రీలంకపై నాలుగో ఇన్నింగ్స్‌లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే అప్పుడు మ్యాచ్‌ డ్రా కాగా.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఓడిపోయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -