Thursday, May 9, 2024
- Advertisement -

ఈ వారం బిగ్‌బాస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేది ఎవ‌రు?

- Advertisement -

బిగ్‌బాస్ రెండ సీజ‌న్‌లో మ‌రో ఎలిమినేష‌న్‌కు రంగం సిద్ధం అవుతుంది.బిగ్‌బాస్ 11వ వారంలో ఎవ‌రు హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తార‌ని అంద‌రు అతృతుగా ఎదురు చూస్తున్నారు. కౌశల్‌,దీప్తి,పూజా,త‌నీష్‌లు .ఈ వారం ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు.మ‌రి వీరి న‌లుగురిలో ఎవ‌రు బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తారో చూడాలి.హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశ‌ల్‌కు బ‌య‌ట భారీ మ‌ద్ద‌తు ఉన్న సంగ‌తి తెలిసిందే.అత‌ను ఎట్టి పరిస్థుతులలో బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశాలు లేవు.

ఇక త‌నీష్ హీరో కావ‌డం అత‌నికి బ‌య‌ట ఫ్యాన్స్ ఉండ‌టంతో అత‌ను కూడా హౌస్ కొనసాగే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.ఇక మిగిలింది పూజా,దీప్తి.బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రి ఇచ్చిన పూజా టాస్క్స్‌,గేమ్స్‌లో బాగానే పార్టిసిపెట్ చేస్తుంది.ఇక ఆమె ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా రిజస్టార్ కాకపోవ‌డం పూజాకు పెద్ద మైన‌స్‌గా చెప్ప‌వ‌చ్చు.ఇక దీప్తి …ఇప్ప‌టికే చాలాసార్లు ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డింది దీప్తి.ఎలిమినేష‌న్‌కు వ‌చ్చిన ప్ర‌తిసారి ఎవ‌రో ఒక‌రు కౌశ‌ల్‌తో గొడ‌వ పెట్టుకోవ‌డం,హౌస్ నుంచి వారు ఎలిమినేష‌న్ కావడం జ‌రుగుతు వ‌స్తుంది.

కాని ఈ వారం అటువంటి పరిస్ధితులు లేక‌పోవ‌డం దీప్తికి పెద్ద దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు.ఇక ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయిన ప్ర‌తిసారి త‌న‌లోని అస‌హనాన్ని బ‌య‌ట పెడుతు వ‌స్తుంది దీప్తి.దీంతో ఈ వారం బ‌య‌టికి వెళ్లే వారిలో మొద‌టిగా దీప్తి పేరు వినిపిస్తుంది.బిగ్‌బాస్ 11వ వారం జ‌రిగే ఎలిమినేష‌న్‌లో పూజా ,,దీప్తిల‌లో ఎవ‌రో ఒక‌రు హౌస్‌ను వ‌దిలి బ‌య‌టికి వ‌స్తారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.మ‌రి మ‌నం అనుకున్న‌ట్లు జ‌రుగుతుందో లేక బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల‌కు ఎలిమినేష‌న్లో ట్వీస్ట్ ఇస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -