Tuesday, April 30, 2024
- Advertisement -

కృష్ణాజిల్లాలో దారుణం…. కాలువ‌లోకి దూసుకెల్లిన కారు..రామ‌చంద్రాపురం ఎస్సై గ‌ల్లంతు..?

- Advertisement -

విజయవాడ సమీపంలోని ఘంటసాల వద్ద విషాదం చోటు చేసుకుంది. పంట కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఎస్సై గల్లంతయ్యారు. రామచంద్రాపురం నుంచి కోడూరుకు వెళుతున్న ఓ కారు అవనిగడ్డ-బెజవాడ కరకట్టపై పాపవినాశనం వద్ద అదుపు తప్పి బందరు కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారులో ఉన్న ఎస్సై కోట వంశీ గల్లంతయ్యారు.

రామచంద్రాపురం ఎస్సై కోట వంశీ తల్లితో కలసి స్వగ్రామం కోడూరుకు ఈ రోజు బయలుదేరారు. ఈ నేపథ్యంలో పాపవినాశనం వద్దకారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లగానే వాహనంలోనే ఉన్న తల్లిని వంశీ ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం కారులో ఉన్న బ్యాగ్ ను తెచ్చేందుకు మళ్లీ కారులోకి వెళ్లిన వంశీ భారీగా వస్తున్న నీటి ప్రవాహం కారణంగా గల్లంతయ్యారు. ఎస్సైతో పాటు కారు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలను మొదలుపెట్టారు. కాలువ పైన గేట్లను మూసివేసి నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు యత్నిస్తున్నారు. కళ్ల ముందే కుమారుడు గల్లంతు కావడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. అవనిగడ్డ నుంచి కోడూరుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఎస్సై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఎస్సై కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అవనగడ్డలో పంట కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కారుతో పాటు వంశీధర్ చాలా దూరం కొట్టుకుపోయినట్లు భావిస్తున్నారు. పంటకాల్వ ప్రవాహాన్ని ఎగువన నిలిపేసి కారును, వంశీధర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -