Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్ :దీప్తి ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకోగ‌ల‌దా?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ఇప్ప‌టికే 70 రోజులకు పైగా పూర్తి అయింది.ఇంకా 30 రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో ఎలిమినేష‌న్స్‌కు రంగం సిద్దం అవుతుంది.ఇక నిన్న జ‌రిగిన ఎపిసోడ్‌లో ఈ వారం ఎలిమినేష‌న్‌కు నామినేష‌న్ ప్ర‌క్రియ న‌డిచింది.ఇక ఈ వారం ఎలిమినేష‌న్‌లో కౌశ‌ల్‌,దీప్తి,పూజా రామాచంద్ర‌న్‌,త‌నీష్‌లు నామినేట్ అయ్యారు.వీరి నలుగురిలో ఎవ‌రో ఒక‌రు ఈ వారం హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తారు.కౌశ‌ల్‌,త‌నీష్‌లు హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లుగా ఉండ‌టంతో వీరు హౌస్‌లో కొన‌సాగే అవ‌కాశాలు ఎక్కువ‌.ఇక మిగిలింది దీప్తి,పూజా రామ‌చంద్ర‌న్‌.వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వచ్చిన పూజ రామచంద్రన్‌ మళ్లీ ఈ సారి కూడా నామినేషన్‌లోకి వచ్చింది.

మరి ఈ సారి ప్రేక్షకులు పూజను సేవ్‌ చేస్తారో లేదో చూడాలి.ఇక ఇప్ప‌టికే చాలాసార్లు నామినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డిన దీప్తి ఈసారి ఎలిమినేష‌న్ త‌ప్పించుకుంటుందో లేదో చూడాలి.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎలిమినేష‌న్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే దీప్తియే హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.పూజా రామాచంద్ర‌న్ టాస్క్స్‌,గేమ్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది.దీంతో ఆమెను చాలామంది ఇష్ట‌ప‌డుతున్నారు.ఇక మిగిలింది దీప్తియే కాబ‌ట్టి ఆమె బ‌య‌టికి రావ‌డం ప‌క్కా అని చాలామంది న‌మ్ముతున్నారు.ఈ వారం ప్రేక్ష‌కులు ఎలాంటి ట్వీస్ట్ ఇస్తారో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -