Monday, April 29, 2024
- Advertisement -

గీతా మాధురికి ల‌వ్య్వూ చెప్పిన కౌశ‌ల్

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ తుది అంఖానికి చేరుకుంటుంది.దీంతో హౌస్‌మెట్స్‌లోని నిజ‌మైన గేమ్‌ని బ‌య‌టికి తీయ‌డానికి బిగ్‌బాస్ టీం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.దీనిలో భాగంగానే సోమ‌వారం జ‌రిగిన 86వ ఎపిసోడ్‌లో ‘లవ్ హేట్ టాస్క్’ ఇచ్చాడు బిగ్‌బాస్.హౌస్‌లో మీరు ప్రేమించే వ్యక్తి ఎవరు? మీరు ద్వేషించే వ్యక్తి ఎవరు? ప్రేక్షకులకు మాదిరే కంటెస్టెంట్స్ కూడా లవ్ చేసే హేట్ చేసేవాళ్లు ఉన్నారా? వాళ్లు ఎవరో బయటకు తీసే ప్రయత్నం చేశారు బిగ్‌బాస్.

బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నాళ్ల పరిచయంలో ప్రేమించే వ్యక్తులు, ద్వేషించే వ్యక్తులు ఉండనే ఉంటారు కాబట్టి వాళ్లు ఎవరో మొహమాటం లేకుండా వ్యక్తపరిచి అభిప్రాయం చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు బిగ్‌బాస్‌. మీరు ప్రేమించే వ్యక్తి ఉంటే.. లవ్ తో మొదలు పెట్టి.. ఆ వ్యక్తి అంటే ఎందుకు ఇష్టమో చెప్పాలన్నారు. ఇక హేట్ చేసే వ్యక్తుల పేరు కూడా చెప్పిహేట్‌తో మొదలు పెట్టి,వారిని ఎందుకు హేట్ చేస్తున్నారో కార‌ణం చెప్పాల‌ని తెలిపారు.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి కౌశ‌ల్ గీతా మాధురికి లవ్య్వూ చెప్పి అంద‌రికి షాక ఇచ్చాడు.గ‌త కొన్ని ఎపిసోడ్‌ల నుంచి వీరిద్ద‌రికి పెద్ద‌గా ప‌డ‌టం లేద‌ని తెలిసిందే.దీంతో కౌశ‌ల్ గీతాకు లవ్యూ చెప్ప‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

గీతా ఎందుకు ఇష్ట‌మో చెప్పుకొచ్చాడు కౌశ‌ల్‌.మీ ప్రవర్తన, మీ అమాయకత్వం, మీ తింగరితనం నాకు బాగా నచ్చుతాయి అంటు చెప్పాడు కౌశ‌ల్‌. మ‌రో విశేషం ఏమిటంటే హేట్య్వూ కూడా గీతాకే చెప్పాడు కౌశ‌ల్‌.నేను చేయని వాటిని చేశానని, అనని వాటిని అన్నట్టుగా ఊహించుకుని ప్రతి దానికి గొడవ పడటం తనకు నచ్చలేదని అందుకే గీతను హేట్ చేస్తున్నా అన్నారు.దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వచ్చిందని చూసే ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -